రజస్వల అయిన తర్వాత ఎందుకు ఫంక్షన్ భోజనాలు పెడతారో తెలుసా

రజస్వల అయిన తర్వాత ఎందుకు ఫంక్షన్ భోజనాలు పెడతారో తెలుసా

0
165

అమ్మాయిలు రజస్వల అయింది అంటే చాలు వేలాది మందిని పిలిచి భోజనాలు పెద్ద పెద్ద ఫంక్షన్లు, మైకులు ఆర్బాటాలు పెట్టి ఈ మధ్య ఇలాంటివి చేస్తున్నారు, అసలు ఇది గతం నుంచి పాటిస్తున్నారా అంటే? లేదు అనే చెబుతున్నారు, కొందరు ధనవంతులు తీసుకువచ్చిన కల్చర్ ఇది అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇలా చేయకూడదు, ఆమె జీవితంలో ఇది సాధారణమైన విషయంగానే ఉంచాలి, అయితే గతంలో బాల్య వివాహాలు జరిగే రోజుల్లో మా ఇంట్లో పెద్దమనిషి అయిన పిల్ల ఉంది….ఆమెకు తగిన వరుడునిచ్చి పెళ్లి చేద్దాము అనే ఆలోచనతో ఇలా ఫంక్షన్ చేసేవారు.

ఆరోజుల్లో ఇలా చుట్టు పక్కల వారిని అందరిని పిలవడం వల్ల, పిల్ల పెద్ద మనిషి అయింది ఓ ఏడాది తర్వాత వివాహానికి సంబంధాలు చూడవచ్చు అని భావించేవారు , ఇలా అందరికి తెలుస్తుంది అని చేసేవారు, దీనిని ఇప్పుడు కొందరు ధనవంతులు ఆర్భాటంగా చేస్తున్నారు.

బ్యానర్ లు పెట్టి సినిమా షూటింగ్ లా చేయడం వల్ల లాభం లేదు అంటున్నారు, ఇప్పటికీ యూపీ రాజస్ధాన్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో దీనిని ఇంత పెద్ద ఎత్తున చేయరు, ఏపీ తెలంగాణ తమిళనాడులో ఈ సంప్రదాయం చేస్తారు, నిపుణులు పెద్దలు ఇలాంటి ఆర్బాటాలు వద్దు అని సలహా ఇస్తున్నారు.