సుమకి రాజీవ్ కి ఏమైంది – అసలు గొడవకు కారణం బయటపెట్టిన రాజీవ్ కనకాల

సుమకి రాజీవ్ కి ఏమైంది - అసలు గొడవకు కారణం బయటపెట్టిన రాజీవ్ కనకాల

0
94

ఇటీవల యాంకర్ సుమ రాజీవ్ కనకాల విడిపోయారు అని విడాకులు తీసుకున్నారు అని అనేక వార్తలు వినిపించాయి, వారు విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉంటున్నారు అని వార్తలు వినిపించాయి, అయితే ఇవన్నీ ఉత్తి ఫేక్ అని ఇది నిజం కాదని, వారు ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలిసి దిగిన ఫోటోలు వీడియోలతో తేలింది.

గాసిప్ రాయుళ్లు ఇష్టం వచ్చినట్టు వార్తలు అయితే రాశారు, తాజాగా దీనిపై రాజీవ్ కనకాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.. అప్పట్టో సుమకి నాకు మధ్య చిన్న గొడవైంది. అందరి ఇళ్లల్లో ఉన్నట్టే మా మధ్య కూడా గొడవైంది. అది మారుతూ మారుతూ చివరికి మీడియాకి వేరే విధంగా వెళ్లింది.

అసలు మేము తర్వాత మాములుగానే ఉన్నాం.. కాని ఇది మీడియాలో రావడంతో అందరూ దీని గురించి అనేక వార్తలు రాశారు, దీనిపై సుమ ఎంతో బాధపడింది, అంతేకాదు ఇది పిల్లలపై ఎఫెక్ట్ పడుతుంది అని బాధఫడింది, అందరి ఇంట్లో ఉండే చిన్న చిన్న తగాదాలుగా మాకు వచ్చాయి, ఎలాంటి విభేదాలు లేవు, ఇద్దరం ఒకే చోట ఉంటున్నాం అని తెలిపారు రాజీవ్, మొత్తానికి ఈ విషయం గురించి వెంటనే మాట్లాడితే మళ్లీ అది ఎలా వెళుతుందో అని వెంటనే దీనిపై స్పందించలేదు, అందుకే ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు షేర్ చేశాము అన్నారు.