రిస్క్ తీసుకుంటున్న రకుల్‌.. సినిమా కోసం ఏకంగా..!!

రిస్క్ తీసుకుంటున్న రకుల్‌.. సినిమా కోసం ఏకంగా..!!

0
120

నటి నటులకు కొత్త సినిమా తియ్యాలంటే దానికి తగ్గటు తమ ఆకారన్ని మార్చుకోవాలి. అలాగే ఆ సినిమాలో తమ పాత్రకు తగ్గ అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటికే తమ నటనల కోసం గుర్రపు స్వారి నేర్చుకుంది అనుష్కా. అలాగే ఫిదా లో ట్రాక్టర్ నడిపింది సాయిపల్లవి. మెరీ కోం సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంది ప్రియంక కాని రకుల్ మాత్రం కాస్త వెరైటి విషయాన్నే నేర్చుకున్న అంటుంది. ‘దేదే ప్యార్‌ దే’ సినిమా కోసం బార్టెండింగ్‌ నేర్చుకున్నారట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బార్టెండింగ్‌ అంటే బార్‌లో సర్వ్‌ చేసే జాబ్‌. అజయ్‌ దేవ్‌గన్, టబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రంలో టబుతో పెళ్లయిన అజయ్‌ దేవ్‌గన్‌ మళ్లీ రకుల్‌ని ప్రేమించడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అన్నది చిత్రకథ.

ఈ సినిమా కోసం రకుల్‌ 8 కిలోల బరువు తగ్గటమే కాకుండా బార్టెండింగ్‌ కూడా నేర్చుకున్నారు. కొత్త విద్య నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ- ”ఈ సినిమాలో అయేషా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర కోసం కొన్ని వారాలు వర్క్‌షాప్‌కి వెళ్లాను. షేకర్స్‌ని ఎలా ఉపయోగించాలి, డ్రింక్స్‌ ఎలా కలపాలి, మిక్సర్స్‌ని కరెక్ట్‌గా ఎలా హ్యాండిల్‌ చేయాలనేవాటిపై శిక్షణ తీసుకున్నాను. గ్లాసుని గాల్లో ఎలా తిప్పాలి అనేవి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. అంటుంది ఈ అమ్మడు. ఈ సినిమా ఈనెల 17న విడుదల కాబోతోంది. నటన కోసం మంచి పనులే కాదు కొన్ని వింత పనులు కూడా నేర్చుకోవచ్చు అని ప్రుఫ్ చేసింది ఈ అమ్మడు..