రాచనాగు మన ప్రాంతంలో కనిపించవు కాని కర్నాటక, ఒరిస్సా యూపీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఇవి శివాలయంలో కూడా శివునికి అభిషేకం జరిగితే అక్కడ లింగాన్ని చుట్టుకుంటాయి, అయితే వేగంగా వెళ్లే పాముగా దీనిని చెబుతారు, ఈ నాగు చాలా విషపూరితం అయింది.
తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ రాచనాగుపాము కలకలం సృష్టించింది. పది అడుగుల పొడవుగల ఓ రాచనాగు బెహ్రాంపూర్‌లోని నందికేశ్వర ఆలయంలోకి దూరింది. అయితే ఆ సమయంలో గుడి మూసి ఉంది, వెంటనే అక్కడకు అధికారులు వచ్చారు.
దానిని చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేశారు, ఇది చాలా రేర్ గా కనిపిస్తుంది, పైగా ఇవి పెద్ద పెద్ద పాములు ఉంటాయి.. ఏకంగా 15 అడుగులు కూడా ఉంటాయి, ఇది చాలా వయసు కలిగిన పాము అని తెలిపారు అధికారులు. ఇవి అంత తొందరగా ఏమీ చేయవు కాని వాటికి హాని చేస్తున్నాం అని తెలిస్తే కోరలు చాస్తాయి.