రవికి షాకిచ్చిన యాంకర్ శ్రీముఖి

రవికి షాకిచ్చిన యాంకర్ శ్రీముఖి

0
143

బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖికి మరింత ఫాలోయింగ్ పెరిగింది అనే చెప్పాలి.. అయితే ఆమె ఫైనల్ కు వస్తుంది అని అందరూ అనుకున్నారు వచ్చింది… చివరకు టైటిల్ విన్నర్ అవుతుంది అని అనుకున్నారు కాని ఆమెకు టైటిల్ మాత్రం రాలేదు. అయితే ఆమెకు ఫేమ్ మాత్రం చాలా వచ్చింది అని చెప్పాల్సిందే. ఇక బుల్లితెరలో పటాస్ షో ద్వారా శ్రీముఖి రవి చాలా ఫేమ్ సంపాదించారు. మంచి రేటింగ్ రావడంతో వారికి రెమ్యునరేషన్ కూడా లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇక పటాస్ లో శ్రీముఖి లేకపోవడం టీఆర్పీ కూడా తగ్గింది అంతేకాదు ఈ షోకు గతంలో వచ్చిన ఫేమ్ లేదు అని టాక్ వస్తోంది.

హౌస్‌లోంచి బయటకు వచ్చిన శ్రీముఖి.. ఫ్రస్ట్రేషన్ తీర్చుకునేందుకు మాల్దీవులకు వెళ్లింది. అక్కడే ఎంజాయ్ చేస్తోంది.. తాజాగా లైవ్‌లోకి వచ్చింది ఈ అమ్మడు. అక్కడ చాలా మంది అభిమానులు ఒక్కటే ప్రశ్నను అడిగారు. పటాస్ షోలోకి ఎప్పుడు వస్తావ్? నిన్ను మిస్ అవుతున్నాము.. అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా..తాను సరికొత్త షోలు చేయబోతున్నాను అని చెప్పింది, దీంతో ఆమె ఇక పటాస్ కు రాదు అనేది క్లారిటీ వచ్చింది.

పటాస్ ‌షోలో పాల్గొంటానా లేదా అన్నది ఓ వారంలో చెబుతాను. అని చెప్పింది కాని వెంటనే చెప్పలేదు, దీంతో రవి పక్కన చెయ్యలేక ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది..అంతేకాదు తన తండ్రి చెబితే ఆ షో చేస్తాను అని చెప్పిందట, సో మొత్తానికి రవికి మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.