రెండు ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసిన న‌టి రేణు దేశాయ్ కార‌ణం ఇదే

రెండు ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసిన న‌టి రేణు దేశాయ్ కార‌ణం ఇదే

0
131

రేణు దేశాయ్ ఇప్పుడు ఆమె న‌ట‌న‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు, ఆమె సినిమాలు నిర్మిస్తూ డైరెక్ష‌న్ చేస్తూ కాస్త బిజీగా ఉన్నారు, అయితే తాజాగా ఆమె గురించి ఓ వార్త వినిపిస్తోంది.రేణు దేశాయ్‌ తన రెండు లగ్జరీ కార్లు ఆడీ ఏ6, పోర్షే బాక్సర్‌లను అమ్మేశారు.

దీంతో ఆమెకి ఆర్ధిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయా అని చాలా మంది అభిమానులు ఆలోచించారు, అయితే అలాంటి ఆర్దిక స‌మ‌స్య‌లు ఏమీ లేవ‌ట‌, ఇలా కార్లు అమ్మ‌డానికి కార‌ణం కూడా చెబుతున్నారు ఆమె.. సోషల్‌ మీడియా వేదికగా ఇలా ఎందుకు అమ్మేశాను అనేది తెలియజేశారు… వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా డిజీల్‌, పెట్రల్‌తో నడిచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు తెలిపారు.

దీంతో ఆమె సామాజిక సేవ చేయ‌డ‌మే కాదు స‌మాజం కోసం మంచి ప‌నులు చేస్తూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు అని అంటున్నారు.పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని రేణు విజ్ఞప్తి చేశారు. తన కార్లను అమ్మేసి ఆ స్థానంలో ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొన్నానని రేణు వెల్లడించారు. నిజంగా ఆమె తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అంటున్నారు నెటిజ‌న్లు.