రైతుకి కోటి రూపాయల వజ్రం దొరికింది తర్వాత ఏమైందంటే

రైతుకి కోటి రూపాయల వజ్రం దొరికింది తర్వాత ఏమైందంటే

0
145

మొత్తానికి అనంతపురం జిల్లాలో ఓ రైతుకి వజ్రం దొరికింది అని వార్తలు వచ్చాయి, దాని ధర సుమారు కోటి రూపాయలు ఉంటుంది.. అయితే దానికి వ్యాపారి 30 లక్షల రూపాయలు ఇస్తాను అని అన్నాడట.. చివరకు ఆ 30 లక్షలకే వజ్రం ఇచ్చేశాడు, దీనిపై వార్తలు రావడంతో ఇది పెను వార్తగా మారింది.
ఈ వజ్రం విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు.

వారు వజ్రం చిక్కిన రైతు ఇంటికి వెళ్లారు. ఇలా రైతు నుంచి ఆ వ్యాపారి వరకూ అందరిని విచారించారు, ఎక్కడ దొరికింది అనే విషయం నుంచి ఎలా అమ్మారు అనేది తెలుసుకున్నారు.వజ్రం దొరికింది అని రైతు కుటుంబీకులు ఒప్పుకున్నారు. కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం తాను ఎలాంటి వజ్రమూ కొనుగోలు చేయలేదని అధికారులతో చెప్పాడు.

గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రం చిక్కిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తానికి దీనిపై పూర్తిగా విచారణ చేస్తున్నారు పోలీసులు రెవెన్యూ సిబ్బంది.