రోజు కూలికి 12 కోట్ల లాటరీ కాని చివరకు ఏం చేశాడంటే

రోజు కూలికి 12 కోట్ల లాటరీ కాని చివరకు ఏం చేశాడంటే

0
92

జీవితంలో కూలి పని చేసుకునే వ్యక్తి కోటి రూపాయలు సంపాదించాలి అంటే చాలా కష్టం.. కాని అతనికి లక్ష్మీ కటాక్షం వరించింది, అవును లాటరీ రూపంలో అతనికి వరం గేటు దగ్గరకు వచ్చింది..కేరళకు చెందిన రోజు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. కేరళ సర్కారు నిర్వహించే న్యూఇయర్-క్రిస్ మస్ లాటరీకి సంబంధించి ఫిబ్రవరి 10న డ్రా తీయగా.. మలూర్ గిరిజన ప్రాంతంలోని తొలంబ్రకు చెందిన పెరున్నాన్ రాజన్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.

రోజుకు నాలుగు నుంచి ఐదు వందలు సంపాదించుకునే ఆ వ్యక్తికి, ఏకంగా 12 కోట్ల రూపాయల లాటరీ తగలడంతో అతను షాక్ అయ్యాడు… తనకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు, ఇందులో టాక్సు అలాగే టికెట్ అమ్మిన వారికి పర్సెంటైజ్ పోను అతనికి 7 కోట్ల రూపాయల వరకూ వస్తుంది.

ఈ డబ్బుతో ముందు తనకు ఉన్న అప్పులు అన్నీ తీరుస్తా అని.. మంచి ఇళ్లు కట్టుకుంటాను అని రాజన్ చెబుతున్నాడు …. రాజన్ కు భార్య రజని, ఇద్దరు కుమార్తెలు అక్షర, అథిర, కుమారుడు రిగిల్ ఉన్నారు. అలాగే ఈ గ్రామస్తులు కూడా చాలా సంతోషించారు, తాను ఈ డబ్బుతో వ్యవసాయం అలాగే వ్యాపారం చేస్తాను అని …ఈ డబ్బు అందగానే కొద్ది మొత్తంలో పేదలకి సాయం చేస్తాను అన్నాడు.