మన దేశంలో వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారు… వారు వారి వారి సంప్రదాయ పద్దతిలో దేవున్ని కొలుస్తుంటారు. క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్లి ప్రెయిర్ చేసుకుంటారు… ముస్లిమ్స్ అయితే మసీదుల్లో నమాజ్ చేసుకుంటారు.. ఇక హిందువులు అయితే గుడికి వెళ్లి పూజలు చేయిస్తారు..
లేదంటే ఇంట్లోనే పూజలు చేసుకుంటారు.. అయితే హిందువులు ఇంట్లో పూజలు చేసుకునే వారు క్రింద తెలిపిన విధంగా పూజలు చేస్తే మీరు సుఖసంతోషాలతో ఉంటారని అంటున్నారు… ముందుగా కాల కృత్యాలను తీర్చుకుని స్నానం చేయాలి… ఆతర్వాత పూజకు ముందు రోజు ఉన్న పూలు తులసి చందనము వీటన్నింటిని తీయాలి…
ఆతర్వాత దేవాతా మూర్తులను శుభ్రం చేయాలి… దాని తర్వాత దేవాతా మూర్తులను ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి…. ఆ తర్వాత కావాల్సిన పూజా సమాగ్రినీ దగ్గర పెట్టుకోవాలి దుర్ముహూర్తం వచ్చేలోపు పూజ చేయాలి…