కక్కుర్తి కొంత మందికి చాలా ఉంటుంది, 1001 బిల్ అయితే ఆ 1000 తో పాటు రూపాయి కూడా తీసుకుంటారు, ఇలాంటి వ్యాపారులు కొందరు ఉంటారు, మరికొందరు పర్వాలేదు అంటారు, అయితే ఇక్కడ కూడా ఓ వ్యాపారి కక్కుర్తి పడ్డాడు అది పది రూపాయలు, కాని అతనికి లక్షల ఫైన్ పడింది, మరి ఆస్టోరీ చూద్దాం
ముంబై సెంట్రల్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని ఓ కస్టమర్ వద్ద ఐస్ క్రీమ్ ఎమ్మార్పీ కంటే రూ.10 ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకు పది రూపాయలు ఎక్స్ ట్రా అని అడిగితే కూలింగ్ కోసం ఈ రేట్ అని అన్నాడు, దీంతో మహారాష్ట్రలో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ అయిన ఆయన దీనిపై కేసు పెట్టాలి అని భావించాడు.
రెస్టారెంట్ ఓనర్ రూ.175 తీసుకున్నాడు. కాని దాని మీద 165 ఉంది దీని గురించి చాలా డిస్కషన్ అయిన తర్వాత ఇక చివరకు కన్జ్యూమర్ ఫోరం కు వెళ్లాడు, రెస్టారెంట్ ఓనర్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు ఫైన్ కట్టకపోతే జైలు శిక్ష అన్నారు, దీంతో అక్కడ వ్యాపారులు అందరూ ఎమ్మార్పీ కంటే రేటు ఎక్కువ అమ్మడం లేదు.