రూ.1.20 కోట్ల స్ధ‌లం కొన్న అర‌టిప‌ళ్ల వ్యాపారి ఎలాగంటే

రూ.1.20 కోట్ల స్ధ‌లం కొన్న అర‌టిప‌ళ్ల వ్యాపారి ఎలాగంటే

0
449

అర‌టి ప‌ళ్ల వ్యాపారం చేసే వ్య‌క్తి ఓ స్ధలం కొన్నారు… ఇదేమిటి కొన‌కూడ‌దా అని అనుకుంటున్నారా.. అది అతి ఖ‌రీదైన స్ధలం అందుకే ఇది వార్త‌గా వినిపిస్తోంది, ఆ స్థలం ధ‌ర ఏకంగా రూ.1.2 కోట్లు. ఓ చిరు వ్యాపారి ఇలా భారీ సొమ్ముతో స్థలం కొనడం స్థానికుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

 

అతను కొన్న ఆ స్థలం కేవలం 108 చదరపు అడుగులే, దీనిని ఇంత ఖ‌రీదు పెట్టి కొన్నాడు ఆ వ్యాపారి.

నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలో ఎస్కే జిలాని అనే ఓ చిన్న వ్యాపారి ఉన్నారు.

ఈ చిరు వ్యాపారి, ముంబయి జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్ ద‌గ్గ‌ర ఏకంగా 40 సంవత్సరాలుగా ఇలా బండి మీద అర‌టిపండ్లు అమ్ముతున్నారు.

 

ఇక అక్క‌డ పాత షాపులు తీసివేసి కొత్త షాపులు క‌ట్టాలి అని భావించారు. అక్క‌డ షాపులు క‌డితే అత‌నిని బండి పెట్టుకోనివ్వ‌రు..దీంతో అదే కాంప్లెక్స్‌లో ఎంతో కొంత స్థలం కొనాల‌నుకున్నాడు

బుధవారం జరిగిన వేలం పాటలో పాల్గొన్నారు ఆయ‌న . పాటలో 108 చదరపు అడుగుల స్థలానికి వేలం పాడాడు. ఏకంగా రూ.1.20 కోట్లకు వేలంపాట పాడి స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.