20 ఏళ్లుగా నో ఫుడ్.. కేవలం ఇసుక మాత్రమే తింటూ బతికేస్తున్న ఓ వ్యక్తి ఎక్కడో కాదు ఏపీలోనే…

20 ఏళ్లుగా నో ఫుడ్.. కేవలం ఇసుక మాత్రమే తింటూ బతికేస్తున్న ఓ వ్యక్తి ఎక్కడో కాదు ఏపీలోనే...

0
88
OLYMPUS DIGITAL CAMERA

మనం తినే ఆహారంలో చిన్న చిన్న రాళ్లు ఉంటే ఎక్కడ ఆరోగ్యం పాడు అవుతుందోనని దాన్ని తినడం మానేస్తాము. కానీ ప్రకాశం జిల్లాకు చెందిన శివ భక్తుడు ఒకరు 20 సంవత్సరాలుగా ఇసుకను తింటూ బతికేస్తున్నాడు…

నమ్మడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇది వాస్తవం మహా శివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన కోటిశ్వరరావు కర్నూల్ జిల్లాలోని మహానందికి వచ్చి ఇసుక తింటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు కొంతమంది ఎందుకు ఇసుక తింటున్నారని అడగగా అందుకు కోటిశ్వరరావు సమాధానం ఇస్తూ….

తన కోరిక నెరవేరితే ఇసుక తింటానని బదులిచ్చాడు.. 20 ఏళ్ల క్రితం విజయవాడ కనక దుర్గమ్మగుడికి వెళ్లి మొక్కుకున్నానని తన కోరిక తీరడంతో అప్పటినుంచి తాను ఇసుక తింటున్నానని చెప్పుకొచ్చాడు గుడిలో ఎవరైనా ప్రసాదం ఇస్తే తింటానని లేదంటే ఇసుకనే ప్రతీ రోజు తన ఆహారం అని తెలిపారు…