ఏడు తలల పాము దేశంలో సంచలనం ఎక్కడ కనిపించిందో చూడండి

ఏడు తలల పాము దేశంలో సంచలనం ఎక్కడ కనిపించిందో చూడండి

0
130

చాలా చోట్ల కొన్ని లోపాలతో రెండు తలల పాము కనిపించింది అంటారు కాని ఏడు తలల పాము కనిపించింది అని ఎవరూ చెప్పరు…ఏడు తలల పాము గురించి సినిమాల్లో విని ఉంటాం…వాస్తవంగా మాకు కనిపించింది కూడా లేదు అని కొన్ని అడవి జాతుల వారు కూడా చెబుతారు..నల్లమల శేషాచలం అడవుల్లో కూడా ఎప్పుడూ ఈ ఏడు తలల పాములు కనిపించలేదు.

అయితే రెండు తలల పాము కనిపిస్తేనే అది పెద్ద వింతగా చెప్పుకుంటారు, కాని తాజాగా ఏడు తలల పాము కుబుసం పెద్ద ఎత్తున ఫోటో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కనకపుర సమీపంలో మరిగౌడన దొడ్డి గ్రామంలో 7 తలల నాగుపాము కుబుసం స్థానికులను ఆశ్యర్యానికి గురిచేసింది. ఇలాగే గత మూడు నెలల క్రితం కూడా కనిపించింది అని స్ధానికులు చెబుతున్నారు , ఈ ప్రాంతం దైవ ప్రాంతంగా చెబుతున్నారు.

ఓ రైతు పొలానికి దగ్గర్లో 7 తలల పాము కుబుసం కన్పించడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఏడు తలల పాము అనేది పురాణాల వరకే పరిమితం అని, వాస్తవానికి అవి ఉనికిలో లేవంటున్నారు డాక్టర్లు.. అయితే కొందరు కావాలనే కుబుసాలు అన్నీ కలిపి ఇలా చేశారు అని అసలు ఇలాంటి పాములు ఉండవు అని అక్కడ వైద్యులు కొట్టిపారేస్తున్నారు.