శని బాధ ఉందా? అయితే శనివారం ఇలా చేయండి ఎంతో పుణ్యం

శని బాధ ఉందా? అయితే శనివారం ఇలా చేయండి ఎంతో పుణ్యం

0
149

శనీశ్వరుని చూపు పడితే ఇక చాలా మంది ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటారు, అయితే శని మన రాశిలో ఉన్న సమయంలో అనేక పాప పరిహారాలు దోష పరిహారాలు చేసుకుంటే శని చల్లని చూపుచూస్తాడు, ముఖ్యంగా శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు.

శని బాధలు ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఏలినాటి శనితో వారు బాధపడుతూ ఉంటే, ప్రతీ నెలా వచ్చే
శని త్రయోదశి నాడు శనిని పూజించాలి, ముఖ్యంగా శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు.

ఆ రోజు స్వామిని కొలవండి ఉదయం తలకి స్నానం చేసి, శనీశ్వరుడి గుడికి వెళ్లి స్వామికి నువ్వుల నూనె తో అభిషేకం చేయండి, నల్ల వస్త్రాన్ని స్వామికి కప్పండి, నల్ల నువ్వులు అభిషేకం చేసి, స్వామికి 9 ప్రదక్షణాలు చేయండి, ఇలా చేస్తూ ఉంటే స్వామి అనుగ్రహం ఉంటుంది, అలాగే మీపై ఉన్నచెడు ప్రభావం కూడా తగ్గుతుంది.