శనిగ్రహం ఎంతో పవర్ ఫుల్ జాతకంలో శని ప్రభావం ఎలా ఉంటుంది

శనిగ్రహం ఎంతో పవర్ ఫుల్ జాతకంలో శని ప్రభావం ఎలా ఉంటుంది

0
312

నవగ్రహాలలో శనిగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా చాలా మంది ఈ గ్రహం పేరు చెబితే భయపడతారు, కాని శని చేసే మంచి మరెవరూ చేయరు అనేది గుర్తు ఉంచుకోండి. శని ఎవరో తెలుసా సూర్యుని కుమారుడు, యుమునికి సోదరుడు
భక్తితో పూజిస్తే ఎంతో మంచి చేస్తాడు శనీశ్వరుడు, చాలా మంది జీవితంలో శనిగ్రహ దోషం వల్ల ఇబ్బందులు పడతారు, పాప పరిహారాలు చేసుకుని మంచి జీవితం సాగిస్తారు.

ఇక్కడ గుర్తు ఉంచుకోవాల్సింది ఏమిటి అంటే , శని సంచారం జాతకంలో ఉన్నపుడు మంచి ఫలితాలను కూడా ప్రసాదిస్తాడు అని తెలుసుకోవాలి…శని జాతక చక్రంలో వున్న స్థితిని బట్టి మంచి చెడు ఫలితాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇక జాతకాల్లో ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని అని ఇలా శని ఆ జాతకంలో వసించే సమయాన్ని బట్టి లెక్కించి చెబుతూ ఉంటారు.

శని దేవుడు పూజిస్తే చాలా మంచి చేస్తాడు, శని నెమ్మదిగా ఉండే గ్రహం, అందుకే మంద గ్రహం అని పిలుస్తారు, శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వెల నూనెతో అభిషేకం చేస్తే పాపాలు దోషాలు పోతాయి.