శ్రావణమాసం నోములు చేసుకునే వారు ఇది తప్పక తెలుసుకోండి

శ్రావణమాసం నోములు చేసుకునే వారు ఇది తప్పక తెలుసుకోండి

0
114

ఇది శ్రావణమాసం ఇప్పుడు చాలా మంది నోములు పూజలు వ్రతాలు చేసుకుంటారు, ఇక కొత్తగా ఈ ఏడాది వివాహం అయితే అత్తగారు అమ్మగారి ఇంటి దగ్గర కొత్త కోడలి చేత పూజలు వ్రతాలు నోమలు చేయిస్తారు, అయితే నిపుణులు చెప్పేది ఒకటే, ఈ ఏడాది ఈ పూజలు వ్రతాలకు మీ ఇంటికి పరిమితం అవ్వాలి అని చెబుతున్నారు.

ఇలా వాయణాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం పక్కవారి ఇంటికి మీఇంటికి పేరంటాలు పెట్టద్దు అని చెబుతున్నారు, ఎంత జాగ్రత్త తీసుకున్నా కచ్చితంగా కరోనా సోకే ప్రమాదం ఉంది, అందుకే మీ ఇంటిలో ఉండే వారు మాత్రమే అత్త తల్లి కోడలు ఇంటివారు మాత్రమే చేసుకోవాలి అని చెబుతున్నారు.

ఈ నెలలో ఇలా వాయణాలు పేరంటాలు పెట్టుకుని జనాలు ఎక్కువ మంది వస్తే ఆ కరోనా చాలా కుటుంబాలని చితిమేస్తుంది, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా అందరూ ఆరోగ్యంగా ఉంటే ఇంత కంటే మంచిగా పూజలు వ్రతాలు చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు, డాక్టర్లు పండితులు కూడా ఇదే సలహా ఇస్తున్నారు.