మన దేశంలో ప్రతీ వీధిలో శివాలయం ఉంటుంది.. శివుడ్ని అంత భక్తి శ్రద్దలతో కొలుస్తాం.. ఆ అభిషేక ప్రియుడిని నిత్యం అభిషేకం చేస్తూ విభూదితో పూజ చేసినా ఆయన ఎంతో కరుణిస్తాడు, ఇక శివుడికి
శ్మశానం ఎంతో ఇష్టమైన ప్రాంతం. చాలా మందికి శివుడు శ్మశానంలో ఎందుకు కొలువై ఉన్నాడనే సందేహం ఉంటుంది.
అయితే ఓసారి పార్వతి దేశి శివుడ్ని ఈ విషయం అడుగుతుంది స్వామి మీరు ఎందుకు శ్మశానంలో ఉంటారు అని ప్రశ్నిస్తుంది. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రదేశం శ్మశానం అని… భూత ప్రేతాత్మలు శ్మశానంలో ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా అడ్డుకుంటూ ఉండటంతో దీన్ని గమనించిన బ్రహ్మ శ్మశానంలో ఉండి అక్కడ తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచాలని సూచించారని చెప్పారు.
అందుకే ఆ సమయం నుంచి శివుడు శ్మశానంలో ధ్యానం చేస్తూ ఉండిపోతాడు, ఆకలితో అలమటించే పేదవాడైనా… కోట్ల రూపాయలు సంపాదించిన శ్రీమంతుడైనా చనిపోయాక శ్మశానానికే రావాలి. భగవంతుని దృష్టిలో అందరూ సమానమని లోకానికి చాటి చెప్పాలనే మరో కారణం కూడా ఇందులో ఉంది అని చెబుతున్నారు పెద్దలు, అందుకే శివుడు శ్మశానం అంటే ఇష్టపడతాడు. ఇక శ్మశానంలో ఒంటరిగా శవాన్ని వదిలి అందరూ వెళతారు… వారికి శివుడు తోడు ఉంటాడు, మనిషి శరీరానికి మరణం, ఆత్మకు కాదు అనేది గ్రహించాలని చెబుతాడు శివుడు.