ఈ కరోనా వైరస్ మన దేశంలో విరుచుకుపడుతోంది, ఈ సమయంలో లాక్ డౌన్ అమలు అవుతోంది.. కేసులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు, అయితే ఈ వైరస్ వేళ చాలా మంది వివాహాలు వాయిదా వేసుకున్నారు, కొందరు మాత్రం అనుకున్న సమయానికి చేసుకుంటున్నారు.
చాలా మంది ధనవంతులు తమ వివాహాలు వెనక్కి వాయిదా వేసుకుంటే, కొందరు ధనవంతులు అనుకున్న సమయానికి గ్రాండ్ గా , కొందరు కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరుపుకుంటున్నారు, ఇక వివాహాల్లో గిఫ్ట్ లు ఇవ్వడం షరామాములే, తాజాగా ఇక్కడ కూడా వింతగా గిఫ్ట్ లు తయారు చేయిస్తున్నారు.
ఈ గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోతుంది అంటున్నారు, ఇప్పుడు మాస్క్ ఎంతో ముఖ్యం అనేది తెలిసిందే, అందుకే ఇక్కడ వివాహంలో వెండి మాస్క్ లను తయారు చేయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి, చిక్కోడి తదితర ప్రాంతాల్లో వెండి మాస్క్ లకు డిమాండ్ అధికంగా ఉంది. వీటి ధర ఒక్కొక్కటీ రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకూ పలుకుతోంది. వీటిని వివాహానికి వచ్చే వారికి గిఫ్ట్ గా ఇస్తున్నారట ఈ ధనవంతులు.