సీమంతం చేసే సమయంలో పేరంటాళ్లు చేతికి గాజులు ఎందుకు వేస్తారో తెలుసా

సీమంతం చేసే సమయంలో పేరంటాళ్లు చేతికి గాజులు ఎందుకు వేస్తారో తెలుసా

0
116

మన సంప్రదాయాల్లో కడుపుతో ఉన్న మహిళలకు ఆ పుణ్య ఇల్లాలికి సీమంతం ఎంతో గ్రాండ్ గా చేస్తారు, ఇక ఆమె చేతికి ఆరోజు ఎంతో అందంగా మట్టి గాజులు వేస్తారు, ఆ ఫంక్షన్ కు వచ్చిన ముత్తైదువులు అందరూ జత గాజులు చేతికి తొడుగుతారు.

పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. ఇప్పుడు రోజుల్లో కొందరు తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారు, అయితే ఇలా ఎందుకు జత మట్టి గాజులు వేస్తారు అంటే దీనికి కారణం ఉంది, ఇది కూడా ఆగర్భిణి మంచి కోసమే.

ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే నడిచే సమయంలో అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో గాజులు పగిలితే అమంగళం అంటారు, అందుకే ఆమె జాగ్రత్తగా నడుస్తుంది, అందుకే అలా నడవాలి అని జాగ్రత్త కోసం గాజులు వేస్తారు, అయితే గతంలో ఇలా చాలా మంది వేసేవారు, ఇప్పుడు కాస్త తగ్గించారు, కాని గతంలో వారు ఇలా గాజులు వేయడానికి కారణం ఇదే.