సోష‌ల్ మీడియాలో బ్ర‌హ్మంగారి పోస్టు ? అస‌లు క‌థ ఏమిటి

సోష‌ల్ మీడియాలో బ్ర‌హ్మంగారి పోస్టు ? అస‌లు క‌థ ఏమిటి

0
351

క‌రోనా వ‌చ్చి పోతాము అనే భ‌యం కంటే కొంద‌రు స్ప్రెడ్ చేసే వార్త‌లు విని చాలా మంది పోయేలా ఉన్నారు, అస‌త్య వార్త‌లు వైర‌ల్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, ఇక క‌రోనాకి మందులేదురా బాబు అని ప్ర‌పంచం అంతా ఆ ప‌రిశోధ‌న‌లో ఉంటే.. కొంద‌రు మాత్రం పిచ్చ పిచ్చ వార్త‌లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

క‌రోనాకి ఇదే అస‌లైన మందు అంటూ మ‌రో కొత్త పాట అందుకున్నారు. అంతేకాదు ఇందులోకి బ్ర‌హ్మంగారిని కూడా లాగారు అనే చెప్పాలి.. బ్రహ్మంగారి మఠంలో ఆలయ పూజారి చనిపోయాడని, మిరియాలు, అల్లం, బెల్లం కలుపుకొని తాగితే కరోనా రాదంటూ ప్రచారం జరుగుతోంది.

ఆయన దహన సంస్కారాలు పూర్తయ్యేలోపే ఈ కషాయం తాగాలంటూ కూడా కండిషన్లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రహ్మంగారిమఠం ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య చారి స్పందించారు. బ్రహ్మంగారిమఠం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఇలాంటి చెత్త‌వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దు అన్నారు, చూశారుగా బెల్లం పంచ‌దార కాఫీ పొడి టీపొడి యాల‌కుల పొడి మిరియాల పొడి నిమ్మ‌ర‌సానికి త‌గ్గిపోయే జ‌బ్బు మాత్రం కాదు, ఆ మాట‌లు న‌మ్మ‌కండి, అలాంటి పోస్టులు షేర్ చేయకండి.