శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇవ్వగానే ఏం జరిగింది ? వారి స్నేహం తెలుసా

శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇవ్వగానే ఏం జరిగింది ? వారి స్నేహం తెలుసా

0
334

స్నేహం అంటే గతంలో కుచేలుడు శ్రీకృష్ణుడిని చూపించేవారు, నిజమే ఎన్ని యుగాలు అయినా వారి స్నేహం గురించి అలాగే చెబుతారు, అయితే కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని ముని దగ్గర విద్యాభ్యాసము చేసేటపుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి స్నేహితుడు అవుతాడు.

ఇక్కడ విద్య నేర్చుకున్న తర్వాత శ్రీకృష్ణుడు ద్వారక చేరుకుంటాడు, కుచేలుడు తన సొంత గ్రామము చేరుకొంటాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా ఎక్కువ సంతానం కలుగుతుంది. అధిక సంతానముతో ఎన్నో ఇబ్బందులు పడతాడు, అయితే కుచేలుడి భార్య ఈ బాధలు తగ్గాలి అంటే మీ స్నేహితుడు కృష్ణుడ్ని దర్శించి రమ్మంటుంది.

కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరుతూండగా అతనిని భార్య ఒక చిన్నఅటుకుల మూట ఇస్తుంది. కుచేలుడు ద్వారక చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు, రాజప్రాసాదాలూ చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని ఆలోచన చేస్తాడు, కాని అతనికి కిట్టయ్య దర్శన భాగ్యం కలుగుతుంది.

శ్రీకృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి, కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సుపై చల్లుకొంటాడు. వారిద్దరూ చిన్ననాటి విషయాలు చర్చించుకుంటారు,ఈ మాటల తర్వాత శ్రీకృష్ణుడు కుచేలునితో నాకు ఏం తీసుకు వచ్చావు అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాస్తూ ఉంటాడు,వెంటనే శ్రీకృష్ణుడు ఆ అటుకులు తింటాడు. రెండవ సారి మళ్ళీ అటుకులు తినబోతుండగా రుక్మిణి, స్వామీ మీరు మొదటి సారి అటుకులు తిన్నపుడే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఇలా అటుకులతో అతని బాధలు తీరుస్తాడు, మిత్రుడు ఏం తీసుకువచ్చినా దానిని స్వీకరించి కృష్ణుడు ఎంతో గొప్పవాడు అయ్యాడు.