సూర్య గ్రహణం సమయంలో తులసి ఆకుల్ని ఇలా వాడండి

సూర్య గ్రహణం సమయంలో తులసి ఆకుల్ని ఇలా వాడండి

0
118

మ‌న‌కు రేపు సూర్య గ్ర‌హ‌ణం ఈ స‌మ‌యంలో పండితులు గ్ర‌హ‌ణ ప‌ట్టు విడుపు స్నానాలు చేయాలి అని చెబుతున్నారు, అంతేకాదు ప్ర‌తీ రోజూ చేసేలా పూజ‌లు ఇంట్లో చేసుకోవాలి, అయితే సూర్య‌గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ద‌ర్బ‌లకు కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది, ప్ర‌తీ దానిపైన ద‌ర్బ‌లు వేస్తారు.

ముఖ్యంగా రోజూ తులసిని ఆరాధించడం మోక్షాన్ని ఇస్తుంది. ఇంటి ముందు తులసి కోట ఉంటే… అది చెడు శక్తుల అంతు చూస్తుందని నమ్ముతారు.ఇక తుల‌సి ఆకులు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎలాంటి జ‌బ్బులు ఉండ‌వు, మీరు స్నానం చేసే స‌మ‌యంలో గ్ర‌హ‌ణ విడుపు త‌ర్వాత తుల‌సి నీటితో స్నానం చేయండి.

ఇక మీరు సూర్య‌గ్ర‌హ‌ణం పూర్తి అయిన త‌ర్వాత తీసుకునే ఆహ‌రంలో తుల‌సి చేర్చుకోండి.. నీటిని కూడా తుల‌సి వేసి తీసుకోవ‌డం మంచిది, పాజిటీవ్ ఎన‌ర్జీ రోగ‌నిరోధ‌క శక్తిని కూడా పెంచుతాయి, అందుకే గ్ర‌హ‌ణం పూర్తి అయిన త‌ర్వాత తుల‌సి తీసుకోవ‌డం మంచిది అని చెబుతున్నారు పండితులు.