మనం పెంచుకునే పెట్స్ మన నుంచి దూరం అయితే ఆ బాధ అంతా ఇంతా కాదు, మరీ ముఖ్యంగా అవి తప్పిపోతే అస్సలు తట్టుకోలేరు, తాజాగా ఇలాంటిదే జరిగింది.. అయితే తప్పిపోయింది ఏమిటో తెలుసా
తాబేలు.
దాదాపు రెండున్నర నెలల్లో ఒక మైలు దూరం కూడా నడువలేకపోయింది. ఈ కారణంగానే 68 కిలోల తాబేలు, 74 రోజుల తర్వాత తిరిగి తన యజమాని దగ్గరకు చేరుకుంది. లిన్ కోల్ అనే మహిళ సోలొమాన్ అనే తాబేలును పెంచుకుంటుంది దానికి 15 సంవత్సరాలు.
అది అనూహ్యంగా రెండు నెలల క్రితం కనిపించకుండా పోయింది.. బాధపడి తర్వాత మూడు రోజులకి తాబేలు కనిపించడం లేదనే స్టిక్కర్లను చుట్టుపక్కల ఏర్పాటుచేసింది. లిన్ కోల్ ఇంటి సమీపంలోని ఓ వ్యాలీ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఓ వ్యక్తికి తాబేలు కనిపించింది. వెంటనే లిన్ కోల్కు ఫోన్ చేసి ఆమె ఇంటికి వచ్చి మరీ ఆ వ్యక్తి తాబేలును అందజేశాడు. ఇలా దొరకడంతో ఆమె చాలా ఆనందం వ్యక్తం చేసింది, ఇలా కేవలం 70 రోజులకి ఓ మైలు మాత్రమే ప్రయాణం చేసింది అని తెలుసుకుంది ఆమె.