పన్ను పీకినందుకు 12 ఏళ్లు డాక్టర్ కు జైలు శిక్ష – ఇంతకీ ఏం చేశాడంటే

పన్ను పీకినందుకు 12 ఏళ్లు డాక్టర్ కు జైలు శిక్ష - ఇంతకీ ఏం చేశాడంటే

0
98

కొందరు వైద్యులు చేసే సేవకు చేతులెత్తి మొక్కాలి అని పిస్తుంది, మరికొందరు చేసే పనులకి మాత్రం వారికి శిక్ష పడాలి అనిపిస్తుంది, చేతులు ఎత్తి మొక్కేది ఆ దేవుడికి తర్వాత ఆ వైద్యుడికే కాని కొందరు మాత్రం ఇంత మంచి వృత్తిలో ఉండి సరి అయిన వైద్యం అందించరు, సోషల్ మీడియా యాదిలో పడి కొందరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారు ఉన్నారు, వారికి జైలు శిక్ష పడింది, వారి ప్రాక్టీస్ పోయింది.

పన్ను నొప్పితో బాధపడుతూ డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషంట్ను డాక్టర్ ఫన్నీగా తీసుకున్నాడు.
పేషంట్కు మత్తుమందు ఇచ్చి అతను మాత్రం హోవర్డ్బోర్డు మీద నిల్చున్నాడు. ఇక అది చక్రాలతో ఉంటుంది కాబట్టి అటూ ఇటూ కదులుతూ ఆడుకున్నాడు, ఇలాగే ఆ పేషెంట్ పన్ను తీశాడు, అది కాని జారితే ఇక పేషెంట్ కి ఎంత ప్రమాదం, అలాంటి ఆలోచన లేకుండా డాక్టర్ ఈ దారుణమైన పని చేశాడు.

ఆ డెంటిస్ట్ అంతటితో ఆగలేదు. వైద్యం చేస్తూనే వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు గంటల్లోనే వైరల్ అయింది, అతనిపై డాక్టర్లు సీరియస్ అయ్యారు, ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్లింది, కేసు పెట్టారు.దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు. ప్రమాదకర స్టంట్లతో వైద్యం చేయడం వంటి కేసులు పెట్టారు అతనికి 12 ఏండ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అలస్కాలోని ఈ ఘటన జరిగింది.