తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ బావి- ఈ నీరు ప్రత్యేకత ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ బావి- ఈ నీరు ప్రత్యేకత ఇదే

0
78

మన దేశంలో గతంలో నీరు చాలా మంది బావులు నూతుల నుంచి తెచ్చుకుని తాగేవారు, అక్కడ నీరు స్పష్టంగా ఉండటమే కాదు బాగా తెల్లగా మలినాలు లేకుండా ఉంటుంది అని చెప్పేవారు పెద్దలు, తర్వాత ప్యూర్ గా ఫిల్టర్ అయి వాటర్ వస్తోంది.

అయితే ఇప్పుడు చాలా వరకూ మినరల్ వాటర్ ప్లాంట్స్ కొంటున్నారు, ఇప్పటీకీ గ్రామాల్లో కూడా చాలా మంది నూతుల నుంచి బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్న వారు కొందరు ఉన్నారు..
శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని దూద్ బావి దగ్గర జనం బారులు తీరుతున్నారు.

ఇక్కడ నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. తీయగా ఉంటుంది అంటారు, దాహం వేసిన వారు వెంటనే ఓ అరలీటర్ తాగేస్తారట.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని దూద్ బావిలో మాత్రమే లభిస్తుంది. ఈనీరు చాలా తీయగా ఉంటాయి, మంచి జల కలతో ఉంటుంది
ఈ నీళ్లలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఏ మాత్రం కనపడవు. మొలంగూర్లో సైనికుల కోసం కాకతీయ రాజులు ఈ బావిని తవ్వించారు..ఈ నీళ్లను గుర్రపు బగ్గీల్లో హైదరాబాద్లోని నిజాం నవాబు కుటుంబానికి సరఫరా చేసేవారని చరిత్ర చెబుతోంది. ఈ రూట్ లో వెళితే చాలా మంది టిన్స్ లో ఈ నీరు తీసుకువెళతారు.