గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా తప్పక తెలుసుకోండి

గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా తప్పక తెలుసుకోండి

0
339

మనం గుడికి వెళ్లిన సమయంలో అక్కడ గంట ఉంటుంది, స్వామిని మొక్కుకున్న సమయంలో హారతి ఇచ్చిన సమయంలో దేవాలయంలో గంట కొడతారు భక్తులు, ప్రతీ ఆలయంలో ఇలా గంట ఉంటుంది.
దేవునికి ఎదురుగా గంట కనిపిస్తుంది.

దేవుడికి హారతి ఇచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినపుడు, అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన కైంకర్యాలు చేసినపుడు గంటను కొడతారు. మరి ఎందుకు గంట కొడతారు అనేది తెలుసా. దీని వెనుక అర్ధం పరమార్దం ఉంది.

ఆలయంలో కొట్టే గంటకు ఎన్నో అర్థాలు, పరమార్థాలున్నాయి. దేవుని ముందు గంట కొట్టడం వలన ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులను, చెడు శక్తులను, నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని పండితులు చెబుతున్నారు, ఆ గంట కొట్టడం వల్ల వేరే ఆలోచనలో ఎవరైనా ఉన్నా ఆలోచన పోయి, ఆ స్వామిపై మనసు పెడతారు, ఇక మనం కోరిన కోరికలు స్వామికి చేరేలా ఆ గంట ఘల్లున శబ్దం చేస్తారు,ఇలా చేస్తే తమ కోరిక నెరవేరుతుంది అని స్వామికి చేరుతుంది అని నమ్ముతారు. అందుకే గుడిలో గంట కొడతారు.