తాళికట్టే సమయంలో గురిచూసి పెళ్లికొడుకుని కాల్చి చంపేశారు ఎందుకంటే

తాళికట్టే సమయంలో గురిచూసి పెళ్లికొడుకుని కాల్చి చంపేశారు ఎందుకంటే

0
109
gold demon nepal jungle

ఆ ఇంట పెళ్లి సందడి కనిపిస్తోంది. మరి కొద్ది సేపట్లో వారి ఇంట పెళ్లి భాజాలు మోగే సమయం..ముహూర్తం దగ్గరపడుతోందని హడావుడిగా వరుడు, వధువు తరఫు బంధువులు పెళ్లి మండపానికి వచ్చారు. అక్కడ బంధువులు పెళ్లికి వచ్చిన వారితో హల్ అంతా కిటకిటలాడుతోంది. ఇంతలో దారుణం జరిగింది అందరూ షాక్ అయ్యారు.

పెళ్లి మండపం దగ్గర వరుడిపై దుండగులు తుపాకీతో గురి చూసి కాల్చారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. అయితే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు.

ఉత్తరప్రదేశ్లోని మసీర్పూర్ బజార్లో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వరుడే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అయితే వీరిని గుర్తించి అసలు వివాదానికి కారణం తెలుసుకుంటున్నారు, అయితే తమ బిడ్డ పెళ్లి మధ్యలో ఆగిపోయింది అనే బాధ అమ్మాయి వారి తరుపున ఉంటే, తన కొడుకు ఇక లేడు అనే బాధ వరుడి కుటుంబంలో కనిపిస్తోంది.