త్రాచుపాము పిల్లని నోట్లో పెట్టుకున్న చిన్నారి చివరకు ఏమైందంటే

త్రాచుపాము పిల్లని నోట్లో పెట్టుకున్న చిన్నారి చివరకు ఏమైందంటే

0
111

చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వారికి ఏది దొరికితే దానితో ఆడుకుంటారు, వారికి ఏం తినాలి ఏది ముట్టుకోవాలి అనేది తెలియదు, అయితే దేవేంద్ర అనే ఒక ఏడాది వయసు ఉన్న చిన్నారి ఇంటి దగ్గర ఉన్నాడు, ఆడుకుంటున్న సమయంలో అక్కడకు ఓ పాము పిల్ల వచ్చింది.

దానిని చూసి పట్టుకుని నోటిలో పెట్టుకున్నాడు, అయితే వెంటనే ఇది చూసిన అతని తల్లి ఆ పాముని నోటి లో నుంచి బయటకు తీసింది, అప్పటికే సగం వరకూ అతను నోటిలో పెట్టుకున్నాడు..తన భర్త ధర్మపాల్ తో కలిసి ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది..

అలాగే, ఆ పాముని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి దాన్ని వైద్యులకు చూపించింది, వెంటనే ఆ బాలుడికి యాంటీ-వెమోన్ ఇంజక్షన్ చేశారు, అయితే ఇది విషపూరితమైన నాగుపాము అని చెప్పారు వైద్యులు, అయితే చికిత్స అందించి రెండు రోజులు ఆస్పత్రిలో ఉండమని చెప్పారు.

దీని వల్ల చాలా ప్రమాదం అని.. అది కాటు వేసి ఉంటే చాలా ప్రమాదం అని తెలిపారు, అయితే ఆ పాము పిల్ల చనిపోయింది..ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ఆ బాలుడు ఆరోగ్యం బాగానే ఉంది.