ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసి పెళ్లి చేసుకునే వారు చాలా మంది ఉంటారు ..ఇలాంటి పెళ్లి కొడుకుల ఆటకట్టించడానికి పోలీసులు కూడా సిద్దంగానే ఉంటారు, తాజాగా ఇలాంటి ఘరానా మోసగాడి బాగోతం తెలిసింది మొదటి భార్యకి… ఏకంగా మూడో పెళ్లికి సిద్దం అయ్యాడు ఈ ప్రబుద్దుడు.
ముందు పెళ్లి చేసుకున్నాడు ఆమెని హింసించాడు చివరకు ఆమెకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడు …అయితే ఇక చేసేది లేక ఆమె ఏమీ అనలేదు.. ఇద్దరూ కూడా అతని చేతిలో మోసపోయారు నిత్యం ఇద్దరికి వేధింపులు ఉండేవి.
అయితే ఎవరికి తెలియకుండా మూడో వివాహం కూడా చేసుకునేందుకు రెడీ అయ్యాడు, మొదటి భార్యకు ఈ విషయం తెలిసి పెళ్లి మండపానికి వెళ్లి అక్కడే నాలుగు తగిలించింది చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చి జైల్లో పెట్టించింది.