అతని పేరు రణవీర్ యూపీలో ఉంటాడు… బండరాళ్ల పనికి అతను వెళతాడు, అయితే అతను పనిచేసే లోడ్ కంపెనీలో మరో ఐదుగురు బిహార్ వారు కూడా వచ్చి పని చేసుకుంటున్నారు, వారు వచ్చిన వారానికి ఈ లాక్ డౌన్ వచ్చింది.
దీంతో వారికి ఉపాధి పోయింది, దీంతో వారు ఐదుగురు తిరిగి వెళ్లలేకపోయారు చివరకు ఆ బండరాళ్ల కంపెనీ దగ్గర ఉండిపోయారు, అయితే బీద వాడు అయిన రణవీర్ తన భార్య పుస్తెలు తాకట్టు పెట్టి బియ్యం పప్పులు తెచ్చాడు.
వాటితోనే ఆ ఐదుగురికి మూడు పూటలా అన్నం పెడుతున్నాడు, వారు రాత్రి అక్కడే నిద్రిస్తున్నారు, కాని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం మాత్రం రణవీర్ తీసుకుని వెళుతున్నాడు. కేవలం వారం మాత్రమే కలిసి కూలీ పని చేశాము అని, ఇలా మాకు మంచి మిత్రుడు దొరికాడని , ఈ లాక్ డౌన్ అయ్యాక ఆమె పుస్తెలు మేము కష్టపడి విడిపించి అప్పుడు మా సొంత ఊరు వెళతాం అని వారు మాట ఇచ్చారు.. నిజంగా రణవీర్ చేస్తున్న పనికి అందరూ ఎంతో మెచ్చుకుంటున్నారు.