ఖజురాహో మన దేశంలో చాలా మంది ఆగ్రా తర్వాత ఈ దేవాలయం ఎక్కువగా చూడటానికి వెళతారు.
ఇక్కడ ఎంతో అందమైన శిల్ప వైభవం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అద్బుతమైన శిల్పకళలు ఉన్నాయి..తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు దీనిని నిర్మించారు..ఈ దేవాలయం చండేలా రాజ వంశీకులు నిర్మించారు. ఆనాడు మొత్తం ఈ ఆలయాలు 85 కడితే ఇప్పుడు 25 మాత్రమే ఉన్నాయి.
పురుషాంగ రూపంలో ఉంటాయి.. ఇక ఇక్కడకు వెళితే శృంగార పరమైన కోరికలు పెరుగుతాయని పూర్వికులు అంటుంటారు. చాలా మంది గతంలో వీటిని చూసి ఇలా కోరికలు కలిగాయనేవారట.ఖజురహో దేవాలయాలు ఓ కుమారుడికి తల్లి పై ఉన్న గౌరవానికి ప్రతీకగా నిర్మించినవి అంటారు.
ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. ఖజూర్ అనగా ఖర్జూరం అని చెబుతారు…ఖజురహో సాగర్ ఒడ్డున ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల మంది జనాభా ఉంటారు. మధ్యప్రదేశ్ లో చట్టర్పూర్ జిల్లాలో ఈ ఖజురహో ఉంది. ఇక్కడ ఖర్జూరం పంట కూడా అధికంగా పండుతుంది.