ఈ కోరానాతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు, అయితే చాలా మంది వలస కూలీలు ఎక్కడ వారు అక్కడే ఉండిపోయారు, కాని కొందరు కూలీలు తాజాగా చేసిన ఓ మంచి పని ఇప్పుడు పెద్ద వైరల్ అవుతోంది, దేశంలో అందరూ వారిని ఎంతో ప్రశంసిస్తున్నారు.
రాజస్థాన్ లోని సికర్ జిల్లాలో కోందరు పని కోసం అక్కడకు వచ్చారు, అయితే లాక్ డౌన్ తో వారు ఎక్కడకి వెళ్లడానికి లేదు, దీంతో ఆ వలస కూలీలు అందరిని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ లో ఉంచారు, ప్రభుత్వం వారికి మూడు పూటలా భోజనం అందించింది. అక్కడ సర్పంచ్ వారిని అన్నీ సౌకర్యాలు కల్పించారు.
అయితే ఈ సమయంలో వారికి ఆ ఊరిపై ప్రేమకలిగింది, ఆ స్కూలుని చూసి ఇది పేయింట్ లేక పాడైనట్లు ఉంది దీనికి పెయింట్ వేస్తాం అని ఆ కూలీలు చెప్పారు, వెంటనే సర్పంచ్ టౌన్ నుంచి కమిషనర్ పర్మిషన్ తో రంగుల కొట్టు తీయించి స్కూల్ కి పెయింట్ తీసుకువచ్చాడు.
అంతే ఆ కూలీలు అందరూ కలిసి ఆ స్కూల్ ని కొత్త స్కూల్ గా మార్చేశారు. ఇక కూలీలకు డబ్బు సాయం చేశాడు సర్పంచ్, మాకు వద్దని మాకు మూడు పూటల అన్నం పెడుతున్నారు అది చాలు అని అన్నారట ఆ కూలీలు. నిజంగా వీరు గ్రేట్ కదా.