తొలిఏకాదశి రోజును హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకుంటారు, శ్రీ మహావిష్ణువు పాల కడలిపై నిద్రకుపక్రమించే ఈ రోజునే తొలి ఏకాదశి అని అంటారు, విష్ణుఆలయాల్లో ఉదయం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.
తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజు తిరిగి వస్తాడు అని పురాణాల్లో ఉంది. ఇక తొలి ఏకాదశి బుధవారం శనివారం వస్తే చాలా మంచిది అని పండితులు చెబుతారు.
క్షీరాన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి, కొబ్బరికాయ కొట్టి స్వామిని కొలుచుకోవాలి, అలంకరణ చేసి విష్ణువుకి తులసి ఆకులతో పూజ చేయాలి. శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతి కరమైన రావి ఆకుతో పూజ చేస్తే చాలా మంచిది. రావి చెట్టు దగ్గర నీరు పోసి స్వామిని దర్శించుకున్నా విష్ణువు పేరు 11 సార్లు తలచుకున్నా చాలా మంచిది.