రేపు తొలి ఏకాద‌శి రావిఆకుతో ఇలా చేస్తే ఎంతో పుణ్యం

రేపు తొలి ఏకాద‌శి రావిఆకుతో ఇలా చేస్తే ఎంతో పుణ్యం

0
86

రేపు తొలి ఏకాద‌శి ఈ రోజు విష్ణువుని మ‌న‌సారా ధ్యానించ‌డం చాలా మంచిది, ఆయ‌నకు క్షీరాన్నం నివేదించాలి, అలాగే స్వామికి నిత్యం పూజ‌లు చేసేవారు దేవాల‌యంలో ద‌ర్శించుకోవ‌డం మంచిది అంటున్నారు పండితులు. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి.. పూజలు చేయాలి.

ఇలా దీపం రావి ఆకు కింద పెట్టాలి,ఒక రావి ఆకును పెట్టి దీపాన్ని వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది. అయితే ఈ ప్రమీద కింద రావి ఆకులు పెట్టేటప్పుడు ఆకు కాడ దేవుని పటాలు వైపు.. ఆకు చివరి భాగం మన వైపు ఉండేలా పెట్టాలి.

ఇక రావిచెట్టుకి చెంబుతో నీరు పోసి ఆ శ్రీహ‌రిని స్మ‌రించుకోవాలి, ఆయ‌న‌ని అక్క‌డ కొలుస్తూ ఉన్నా మంచిదే రావిచెట్టు ఆకులు కోసిన‌వి స్వామి ప‌ఠం ద‌గ్గ‌ర పెట్టుకోవాలి, వీలైతే అక్క‌డ పేద‌ల‌కు అన్న‌దానం లేదా బియ్యం పంచాలి.