మనం చెట్ల నుంచి కొన్ని రకలా ద్రవాలు రావడం చూస్తు ఉంటాం..తాటి చెట్టు, ఈత చెట్టు, కొన్ని సార్లు వేప చెట్టు ఇలా కొన్ని చెట్ల నుంచి వచ్చే వాటిని కల్లు అని వాడుక భాషలో అంటారు. ఇక కొన్ని చెట్లకు నీరు కారడం జరుగుతుంది పాల రూపంలో జిగురులాంటి పదార్ధం కూడా వస్తూ ఉంటుంది.
ఇటీవల ఇల్లందులో ఓ ఆలయంలోని రావిచెట్టును నరకడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రావిచెట్టు నుంచి నీరు కారుతోంది. అంతే అక్కడి భక్తులు ఆ చెట్టు కన్నీరు పెడుతోందని… అదంతా దేవుడి మహిమేనని స్థానికులు భావించారు. ఇలా చేసిన వ్యక్తి వల్ల మనకు పాపం తగులుతుంది అంటున్నారు.
ఇక తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది,ఓ చెట్టును కత్తితో నరకగానే నీళ్లు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇది ఎందుకు వస్తుందో అన్న విషయంపై నిపుణులు చెప్పాల్సి ఉంటుందని.. ఇది కూడా అలాంటి మహిమ కలిగిన చెట్టు అంటున్నారు. ఇది తమిళనాడులో జరిగింది.