టీవీ చూస్తే గంటకు 3300 జీతం.. సూపర్ ఉద్యోగం

టీవీ చూస్తే గంటకు 3300 జీతం.. సూపర్ ఉద్యోగం

0
166

ఈ లాక్ డౌన్ తో చాలా మందికి ఉద్యోగాలు లేవు, చాలా మంది ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ సమయంలో కంపెనీలు చాలా నష్టాల్లో ఉన్నాయి, అయితే తాజాగా ఓ గుడ్ ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ..
జస్ట్ టీవీ చూస్తే చాలు. గంటకు 35 పౌండ్లు (రూ.3,300 ) చొప్పున కంపెనీ చెల్లిస్తుంది.

ఈ కంపెనీ యూకేకు చెందిన ఆన్ బయ్ అనే సంస్థ ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే కచ్చితంగా 18 ఏళ్లు దాటాలి, అలాగే మంచి స్పోకెన్ ఇంగ్లీష్, కంటెంట్ రాయగలిగే నైపుణ్యం ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారికి సంస్థ గంటకు 35 పౌండ్లు చొప్పున చెల్లిస్తుంది.

వీరు వారంలో 20 గంటలు టీవీ చూడాలి, ఇలా చేస్తే 60 వేలు చెల్లిస్తుంది…ఈసంస్థ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన టీవీ, కెమేరాలు, హెడ్ఫోన్లు, సినిమా సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీ తదితర వస్తువులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వస్తువులకి సంబంధించి రివ్యూలు సైటులో రాసి పోస్ట్ చేయాలి ఇలా చేస్తే వీరికి మంచి జీతం ఇస్తుంది. ఇప్పటికే చాలా మంది ఈ లాక్ డౌన్ సమయంలో అప్లై చేసుకుంటున్నారట.