రెండు విష‌పూరిత పాముల‌ను తీసుకువ‌చ్చి భార్య‌కి స్కెచ్ వేశాడు దారుణం

రెండు విష‌పూరిత పాముల‌ను తీసుకువ‌చ్చి భార్య‌కి స్కెచ్ వేశాడు దారుణం

0
117

అత్యంత దారుణం విషాద‌క‌ర‌మైన వార్త అనే చెప్పాలి, భార్య‌ని అద‌న‌పు క‌ట్నం కోసం వేధించిన ఓ క‌సాయి ఏకంగా ఆమెని చంపేశాడు, అది కూడా అతి దారుణంగా పాముతో భార్య‌ని చంపించాడు..
కేర‌ళ‌లోని సురేశ్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా సురేశ్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఆమె తీసుకువ‌చ్చే దారి క‌నిపించ‌డం లేదు దీంతో అత‌ను భార్య‌ని చంపాలి అని భావించాడు.

మార్చి నెలలో ఓ వ్యక్తికి రూ.10 వేలు చెల్లించి రక్తపింజరి పామును తీసుకువచ్చి తమ బెడ్రూంలో వదిలాడు. ఆ పామును చూసి హడలిపోయిన ఉత్తర, ఆ పాము నుంచి త‌ప్పించుకుందామ‌నుకుంది, కాని ఆమెని గ‌డ‌ప ద‌గ్గ‌ర కాటువేసింది, దీంతో ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తే బ‌తికింది.

మ‌రోసారి స్కెచ్ వేశాడు, ఈసారి సురేశ్ నాగుపామును తెప్పించాడు. పుట్టింట్లో ఉన్న ఉత్తర నిద్రపోతున్న గదిలో ఆ విషసర్పాన్ని వదిలాడు. ఆ పాము ఉత్తరను కాటేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాని ఈసారి ఒళ్లంతా విషం ఎక్కి ఆమె చనిపోయింది,ఇక ఇలా రెండు సార్లు పాము క‌ర‌వ‌డంతో ఆమె తండ్రికి అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు, భ‌ర్త పై అనుమానంతో మొత్తం త‌మ స్టైల్లో విచార‌ణ చేశారు పోలీసులు, చివ‌ర‌కు నిజం ఒప్పుకున్నాడు ఈ క‌సాయి.