ఉపవాసం ఒంటిపొద్దు ఉంటున్న మహిళలు ఇది తప్పక తెలుసుకోండి

ఉపవాసం ఒంటిపొద్దు ఉంటున్న మహిళలు ఇది తప్పక తెలుసుకోండి

0
118

ఉపవాసం అనేది చాలా మంది పాటిస్తూ ఉంటారు, ఒకపొద్దు కూడా చాలా మంది ఉంటారు, ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండేవారు కొందరు అయితే, కొందరు ఒక పొద్దు మాత్రమే ఆహారం తీసుకుని మరోపూట ఆహారం తీసుకోరు, అయితే ఇది పండుగల సమయం.. ఈ సమయంలో ఇలా ఒంటి పొద్దు ఉపవాసాలు వద్దు అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా షుగర్ సమస్య ఉన్న వారు ఇలాంటి వాటిని మానెయ్యాలి, ఇక్కడ మరో విషయం మీ శరీరతత్వాన్ని బట్టి ఉపవాసాలు ఉండాలి, బీపీ షుగర్ సమస్య ఉన్న వారు కచ్చితంగా ఒంటి పొద్దు ఉండవద్దు, పూర్తి ఉపవాసం ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది.. అలాగే ఏ ఆహారం తీసుకోకుండా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవద్దు.

బాడీ డీ హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.. ముఖ్యంగా నీరు తాగవచ్చు, అయితే చాలా మంది కటిక ఉపవాసం ఉంటారు, దీని వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, మీరు ఉపవాసం ఉండాలి అని అనుకుంటే కచ్చితంగా ఫ్రూట్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో షుగర్ కలపని ఆహారం తీసుకుంటే మంచిది.లేదా డ్రైఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అంటున్నారు వైద్యులు.