ఆ బీరులో మూత్రం పోస్తున్నారా ఇందులో నిజ‌మెంత‌?

ఆ బీరులో మూత్రం పోస్తున్నారా ఇందులో నిజ‌మెంత‌?

0
80

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి, ఇందులో వాస్త‌వాలు అస‌త్యాలు ఏమిటో కూడా తెలియ‌డం లేదు… ఇలా వైర‌ల్ అవుతున్న అనేక వార్తల్లో నకిలీ వార్తలే ఉంటున్నాయి. ఒక బీర్ కంపెనీ ఉద్యోగి ఒకరు గత 10 సంవత్సరాలుగా బీర్ ట్యాంకుల్లో మూత్రం పోస్తున్నాడని, ఈ విష‌యం త‌నే చెప్పాడు అని ఆ బీర్ ఎవ‌రూ తాగ‌ద్దు అని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

ఆ బీర్‌ను ఎవరూ తాగకూడదని.. ఓ వార్త ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అవన్నీ ఫేక్ వార్తలు. అవి ఫేక్ వార్తలని, వాటిని నమ్మకూడదని, తాము కేవలం వినోదం కోసమే అలాంటి వార్తలను పోస్ట్ చేస్తున్నామని ఓవెబ్‌సైట్ యాజమాన్యం ఆ పోస్టుల్లో పెట్టింది.

కాని అంద‌రూ అది ప‌ట్టించుకోకుండా ఈ విష‌యం హైలెట్ చేశారు, దీనిని న‌మ్మి చాలా మంది ఆందోళ‌న చెంది ఆ బీరు తాగ‌డం మానేశారు.. అదంతా పుకారేనని, ఆ బీర్‌లో ఎవరూ మూత్రం పోయడం లేదని వెల్లడైంది. సో ఇలాంటి వార్త‌లు అస‌లు న‌మ్మ‌కండి.