ఈనెల 25న ముక్కోటి ఏకాదశి- వైకుంఠ ఏకాదశి, భక్తులు ఆ విష్ణువుని భక్తితో కొలుస్తారు, ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
అయితే ఈరోజు ఆ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి అని నమ్మకం.
వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.మహావిష్ణువు గరుడ వాహనంపై భూలోకానికి వస్తాడని భక్తులకి దర్శనం కల్పిస్తాడు అని చెబుతారు.
అంతేకాదు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.
శ్రీ వైష్ణవ సంప్రదాయపరుల ఇంటిలో పాశురాలను తిరుప్పావై చదువుతారు, అంతేకాదు విష్ణు సంబంధ స్తోత్రాలను, అర్చనలు, అభిషేకాలను చేస్తారు, స్వామికి తులసి మాల అలంకరిస్తారు, ఇలా విష్ణుమూర్తిని కొలుస్తారు అందరూ.. ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది తులసి తీర్దం తప్పక తీసుకోవాలి.