వక్కపొడి బాగా తీసుకుంటున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి -డేంజర్

వక్కపొడి బాగా తీసుకుంటున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి -డేంజర్

0
115

ఏదైనా ఫుడ్ బాగా తిన్నా తర్వాత అరుగుదల కోసం కిల్లీ వేసుకుంటారు కొందరు, ఇంకొందరు తమలపాకు విత్ అవుట్ సున్నంతో తీసుకుంటారు, ఇంకొందరు కేవలం వక్కపొడి ఆ పలుకులు నములుతారు, అయితే ఇది చాలా మందికి అలవాటుగా మారుతుంది ..దీని వల్ల వారికి చాలా ఇబ్బంది అంటున్నారు వైద్యులు.

ఇలా వక్కపొడి అధికంగా తీసుకునే వారికి నోటిలో పుండ్లు సమస్య వస్తుంది, అంతేకాదు, ఇది రక్తాన్ని విరగ్గొడుతుంది, యాంటీ బాడీస్ తగ్గేలా చేస్తుంది, ఇన్ ఫెక్షన్లు వచ్చిన సమయంలో తగ్గడానికి చాలా సమయం పడుతుంది.

అయితే వక్కపొడిని గర్భిణిలు, బాలింతలు తీసుకోకూడదు. బిడ్డకు, తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది.వక్కలలో ఆల్కలాయిడ్స్, టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. అందుకే వక్కలకి కాస్త దూరంగా ఉండాలి, తాంబూలానికి వాడాలి కాని నోటికి అంత ఎక్కువ వద్దు అంటున్నారు వైద్యులు, నోటి క్యాన్సర్లు సాధారణ క్యాన్సర్లు వచ్చిన వారు ఉన్నారట అధికంగా వక్కపొడి తిని. అందుకే కాస్త దూరంగా ఉండండి నెలకి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ వీటిని తీసుకోవద్దు.