వందల కోట్ల ఆస్తిపరుడు కుమారుడ్ని గుంజీలు తీయించారు ఎందుకో తెలుసా

వందల కోట్ల ఆస్తిపరుడు కుమారుడ్ని గుంజీలు తీయించారు ఎందుకో తెలుసా

0
138

నీకు డబ్బు ఉంటే ఎవరికి? నీ డబ్బు నువ్వు ఎంజాయ చేస్తావు? ఎవరికి ఇవ్వవు కదా నేడు సమాజంలో వినిపించే మాట ఇది, అయితే ఈ కరోనా సమయంలో ఎవరిని బయటకు రావద్దు అని పోలీసులు చెబుతూనే ఉన్నారు, ఇక రాత్రి సమయాల్లో ఏ పనిమీద అయినా బయటకు వస్తే ఇక లాఠీలకు పనిచెబుతున్నారు.

ఉదయం రెండు మూడు గంటలు పాలు కూరగాయలకు సమయం ఇచ్చారు.. అది దాటిన తర్వాత వస్తే ఒక్కొక్కరికి వార్నింగ్, అలాగే కేసులు రాయడం, కార్లు బైకులు సీజ్ చేయడం చేస్తున్నారు…హై ఎండ్ పోర్సే కన్వర్టబుల్ కారులో జాయ్ రైడ్కు బయల్దేరిన ఓ యువకుడికి పోలీసులు ఇండోర్ లో బుద్ది చెప్పారు,

బయటకు రావద్దు అంటే అతి ఖరీదైన కారు వేసుకుని రోడ్డు ఖాళీగా ఉంది కదా అని జాయ్ రైడ్ కు వచ్చాడు, అందరి ముందు మీడియా ముఖంగా అతనితో గుంజీలు తీయించారు పోలీసులు.
టూ సీటర్ పోర్సే కారును డ్రైవ్ చేస్తూ ఖాళీగా ఉన్న రోడ్లపై పరుగులు తీస్తున్నాడు అని ఇలా చేయించారు. అతను ఓ పెద్ద వ్యాపారవేత్త కుమారుడు అని తెలిసింది, అయినా వదలలేదు. అయితే తన కుమారుడ్ని అకారణంగా ఇలా గుంజీలు తీయించారు అని ఏకంగా తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశాడట.