వంటి ఇంట్లో ప‌ప్పు డ‌బ్బా ఎత్తుకెళ్లిన కోతులు అందులో ఏమున్నాయంటే

వంటి ఇంట్లో ప‌ప్పు డ‌బ్బా ఎత్తుకెళ్లిన కోతులు అందులో ఏమున్నాయంటే

0
102

కోతుల‌కు ఏమైనా దొరికింది అంటే చాలు వెంట‌నే లాగేసుకుంటాయి, అయితే తాజాగా ఓ ఇంటి ద‌గ్గ‌ర కోతుల గుంపు వ‌చ్చింది…. ఆ ఇంట్లో మ‌హిళ దాదాపు 30 గ్రాముల బంగారం ఓ ప‌ప్పు డ‌బ్బాలో వేసింది కాని ఆ కోతులు వారి ఇంటిలోకి ప్ర‌వేశించి తినే ఆహ‌రం అనుకుని ఆ పప్పుడ‌బ్బాని తీసుకుని వెళ్లిపోయాయి..

దీంతో ఆ కోతుల‌ని కుటుంబ స‌భ్యులు వెంబ‌డించారు కాని ఆ కోతులు మాత్రం డ‌బ్బా ఎక్క‌డా విసిరెయ్య‌లేదు, అయితే కోతులు ఇలా మెరిసే వాటిని తినే వ‌స్తువులు అని అనుకుని తీసుకువెళ‌తాయి కాని త‌ర్వాత వాస‌న వేరుగా ఉండ‌టంతో వ‌దిలేస్తాయి…అయితే ఇలా బంగారం పోయిందని చుట్టుప‌క్క‌ల వారికి అంద‌రికి చెప్పారు.

కాని ఎవ‌రూ త‌మ‌కు దొరికింది అని చెప్ప‌లేదు.. దాదాపు 5 నుంచి 6 గంట‌ల పాటు బంగారం కోసం వెతికారు అయినా దొర‌క‌లేదు… దీంతో త‌మ బంగారం పై ఆశ‌లు వ‌దులుకున్నారు, అయితే ఆమె మాత్రం క‌ష్ట‌ప‌డిన సొమ్ము ఇలా పోయింది అని బాధ‌ప‌డుతోంది..