వరలక్ష్మీ దేవిని ఈరోజు ఎందుకు కొలుస్తారు? వచ్చే పుణ్య ఫలం ఏమిటి

వరలక్ష్మీ దేవిని ఈరోజు ఎందుకు కొలుస్తారు? వచ్చే పుణ్య ఫలం ఏమిటి

0
95

శ్రావణమాసం వచ్చింది అంటే పూజలు వ్రతాలు చేసుకుంటారు, ఈ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం.
వరలక్ష్మీ దేవీ విష్ణు మూర్తి భార్య. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వివాహం అయిన తొలి ఏడాది పెద్ద పండుగా ఇంటి కోడలితో వ్రతం చేయిస్తారు.

ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని చెబుతారు పండితులు.

విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. వివాహం అయిన స్త్రీలు నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. పిల్లలు కలగడానికి అష్ట ఐశ్వర్యాలు సిద్దించడానికి శాంతియుతంగా ఉండటానికి , ధన ప్రాప్తికి ఈ వ్రతం చేసుకుంటారు.