వర్షం రాక గురించి చెప్పే ఏకైక దేవాలయం ఇదే

వర్షం రాక గురించి చెప్పే ఏకైక దేవాలయం ఇదే

0
109

పూర్తిగా నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి, ఇక ఈసారి వర్షపాతం ఎలా ఉంటుంది అని ప్రతీ ఒక్కరు ఆలోచన చేస్తున్నారు, అయితే వర్షాలు బాగా కురుస్తాయి అని వాతావరణ విభాగం కూడా ఇప్పటికే చెప్పింది.. ఇక పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు.

అయితే ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామస్తులు మాత్రం ఓ గుడి సాయం తీసుకుంటారు..వానలు బాగా పడతాయా? లేక కరువు కాటకాలు వస్తాయా..? అన్నది తెలుసుకోడానికి
వీరు ఈ గుడి దగ్గరకు వెళతారు.. భితర్గావ్ బెహతా గ్రామస్తులు.

ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా ఘతంపూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఊళ్లో వందేళ్లనాటి జగన్నాథుని ఆలయం ఒకటుంది… రుతుపవనాల గురించి ఈ గుడి ముందే చెబుతుందట, ఇక్కడ గుడిలో సీలింగ్ నుంచి రాలే నీటి బొట్టుల బట్టీ వర్షాలు కురుస్తాయా లేదా చెబుతారు. పెద్దగా చినుకులు వస్తే పెద్ద వర్షాలు వస్తాయి, చిన్న చినుకులు వస్తే సాధారణ వర్షం అని తెలియచేస్తుంది అని నమ్ముతారు.