మెగా హీరో వరుణ్ తేజ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ?

Hero Varun Tej is the green signal for another director ?

0
104

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఎఫ్ 3 ఉంది .ఇది సగం వరకూ షూటింగ్ పూర్తి అయింది. ఇక అలాగే మరో చిత్రం గని చేస్తున్నాడు వరుణ్. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత డిస్కషన్ లో ఉన్న సినిమాలు పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే వరుణ్ ఈలోపు మరో దర్శకుడి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ దర్శకుడి పేరు కూడా టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఆయన ఎవరంటే నక్కిన త్రినాథరావు. తాజాగా ఆయన చెప్పిన కథ నచ్చడంతో, వెంటనే వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. అయితే దర్శకుడు త్రినాథరావు మాస్ రాజా రవితేజతో సినిమా చేయనున్నారని వార్తలు వినిపించాయి. ఖిలాడి తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కిస్తారని అనుకున్నారు.

అయితే రవితేజ ప్రస్తుతం శరత్ మండవ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఇక గని, ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్ తో త్రినాథరావు సినిమా ఓకే అయిందని అంటున్నారు. మరి చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.