కొందరు కొన్ని సార్లు అసలు తాము ఏం పని చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటారు, ఇది చివరకు పెను ప్రమాదాలకు కారణం అవుతుంది. ఎమిలీ అనే మహిళ బట్టలను వాషింగ్ మెషీన్లో ఉతుకుతోంది. కొద్ది సేపు అయిన తర్వాత బట్టలు తీయాలి అని భావించింది
కాని అందులో కలర్ గా కనిపించే సరికి షాక్ అయింది, పైగా చేయి పెడితే అది బరువుగా ఉంది, ఒక్కసారిగా ఏమిటా అని చూస్తే అది కొండచిలువ, వెంటనే పక్క ఇంటి వారిని పిలిస్తే వారు వచ్చి వాషింగ్ మిషన్ చూశారు, అందులో పెద్ద కొండచిలువ ఉంది అని చూసి దానిని బయటకు తీశారు.
అయితే ఆ మిషన్ మూడు గంటలు ఆన్ చేసి రోల్ చేసినా ఆ కొండ చిలువకు దెబ్బలు తగలలేదు, దానిని వెంటనే అటవీ ప్రాంతంలో వదిలేశారు..కొండచిలువ వాషింగ్ మెషీన్లోకి ఎలా దూరిందో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. డోర్లన్నీ మూసేసున్నాయి. ఇంతపెద్దది ఎవరికీ కనిపించకుండా లోపలికి రావడంతో అక్కడ మిగిలిన ఫ్లాట్స్ వాళ్లు ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి అని భావించారు..ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ఈ సంఘటన జరిగింది.