బీజ్ పూర్ లో పేదలకు సాయం అందించేందుకు, యువకులు అందరూ ఉదయమే రైతు బజార్ కు వెళుతున్నారు.. అక్కడ మిర్చిఉల్లి టమోటా బీరకాయ బెండ ఇలా రోజుకి రెండు రకాల కూరగాయలు కొని పేదలకు అరకిలో చొప్పున కవర్లలో ప్యాకేజ్ చేస్తున్నారు, ఈ సమయంలో వారు రోజుకి 200 మందికి సాయం చేస్తున్నారు.
అయితే తాజాగా మిర్చి కాటన్ సంచిలు రెండు కొన్నారు.. వాటిని ఆటోలో వేసుకువచ్చిన వారు, షెడ్ లో ప్యాకింగ్ చేస్తున్నారు.. ఈ సమయంలో రాథోడ్ రంజిత్ అనే యువకుడు మిర్చి సంచి చేతితో ముడి విప్పాడు, ఈ సమయంలో లోపల నుంచి కట్ల పాము పిల్ల అతనిని కరిచింది.. అది మిర్చి సంచిలో ఉంది, ఏదో కుట్టింది అని చెప్పడంతో అందరూ ఆ మిర్చి కింద పోశారు.
వెంటనే కట్ల పాము బయటకు వచ్చింది, అతనిని వారి సోదరుడు బైక్ పై ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు, అక్కడ వెంటనే అతనినికి 20 నిమిషాల్లో యాంటీ స్నేక్ డోస్ ఇచ్చారు, చిన్న పాము పిల్లల్లో విషం డేంజర్ అని సరైన సమయానికి తీసుకువచ్చారు అని డాక్టర్ చెప్పారు, ఇప్పుడు అతను కోలుకున్నాడు, అందుకే ఏదైనా పని చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.