చాలా మంది అమ్మాయిలు తమ బాడీలో వచ్చే అవాంచిత హెయిర్ నిఎప్పటికప్పుడు తీసుకుంటారు, మరికొందరు మాత్రం తీసుకోరు, దీని వల్ల వారికి అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి, అయితే చాలా మంది రేజర్ వాడతారు, ఇది అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు, అయితే ఒకవేళ ఇదే వాడితే ఒకసారి వాడింది మళ్లీ వాడకూడదు.
షేవింగ్ తరువాత రెడ్ బంప్స్, కట్స్ అలాగే స్ట్రాబెర్రీ స్కిన్ వంటి సమస్యలు కొందరికి వస్తాయి, దీనికి మనం శరీరానికి వాడే సోప్ వాడకూడదు,నిద్రపోయే ముందు బాడీ హెయిర్ ను షేవ్ చేసుకుంటే మంచిదన్న విషయం మీరు గుర్తు ఉంచుకోండి.
ఇరిటేటెడ్ స్కిన్ ను షేవ్ చేయకండి. అలర్జీస్, ర్యాషెస్ లేదా గాయాలు ఉన్నట్టయితే షేవింగ్ ను అవాయిడ్ చేయడం మంచిది. రాషెస్ వస్తే కొబ్బరినూనె రాసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.
ఇక స్కిన్ ఇరిటేషన్ అనిపిస్తే కొంచెం తేనెని స్కిన్ పై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత వెచ్చటి నీటితో కడిగేయండి.