శిశుపాలుడు గురించి మనం అనేక సార్లు వింటూ ఉంటాము, అసలు శిశుపాలుడు ఎవరు అంటే ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు… అతని తల్లి వసుదేవుని సోదరి శ్రుతదేవి. ఇక శిశుపాలుడు ఎవరో కాదు కృష్ణునికి మేనత్త కొడుకు.
శిశుపాలుడికి పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. పుట్టిన సమయంలో వారి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, ఈ సమయంలో అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో మరణిస్తాడు అని చెబుతుంది.
ఈ సమయంలో తమ బిడ్డ కోసం ఇంటికి ఎవరు వచ్చినా వారి చేతికి బాబుని ఇచ్చేవారు, ఇలా చేతికి ఇవ్వడంతో ఓరోజు ధర్మఘోషుని ఇంటికి బలరామ కృష్ణులు వచ్చారు, ఆ బాలుడ్ని చూడటానికే వారు వచ్చారు…శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలుడికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శిశుపాలుని రక్షించు అని కోరింది.
అయితే ఈ సమయంలో శ్రీకృష్ణుడు అందరి ముందు ఓ వరం ఇచ్చాడు, అది అవకాశం అనే చెప్పాలి, ఇలా శిశుపాలుడు నూరు తప్పులు చేసినా సహిస్తాను అని చెబుతాడు, తర్వాత మాత్రం నా చేతుల్లో హతుడు అవుతాడు అని సహనంతో చెబుతాడు. ఇలా కృష్ణుడు శిశుపాలుడికి నూరు సార్లు అవకాశం ఇచ్చాడు.